Sun Mar 08 2026 08:51:24 GMT+0530 (India Standard Time)
డీఎస్‌కు తీవ్ర అస్వస్థత
మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు

మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.
కార్యక్రమాలు రద్దు...
ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూలో డి.శ్రీనివాస్ చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎంపీ అరవింద్ వెల్లడించారు. రెండు రోజుల పాటు తన అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుంటున్నట్లు అరవింద్ తెలిపారు. డీఎస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Next Story

