Fri Dec 05 2025 11:41:50 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి ఇంటికి ఉత్తమ్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు మాజీ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. ఏఐసీసీ ఆదేశాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగేలా ఆయన నచ్చ చెబుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన నేత కాడంతో ఉత్తమ్ ను కాంగ్రెస్ వీడకుండా ఆయన మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో కొనసాగితే భవిష్యత్ ఉంటుందని కోమటిరెడ్డికి సూచిస్తున్నారు.
హైకమాండ్ పిలిచినా.....
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరాలు, పార్టీలో సమస్యలపై కూడా ఉత్తర్ కుమార్ రెడ్డి చర్చిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా ఉందని తెలిపడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కు గల అవకాశాలను కూడా ఆయనకు వివరిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆయన మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి వివరించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ రావాలని ఆహ్వానించినా ఆయన వెళ్లకపోవడం గమనార్హం.
Next Story

