Sun Mar 08 2026 10:30:23 GMT+0530 (India Standard Time)
గడ్డం రేపు తీసేస్తున్నా : ఉత్తమ్
తన శపథం రేపటితో తీరిపోతుందని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నా

తన శపథం రేపటితో తీరిపోతుందని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గడ్డం రేపు తాను తీసేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. ఇండియా టుడే, ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని ఆయన అన్నారు.
70 నుంచి 75 స్థానాలు...
తమ పార్టీకి 70 నుంచి 75 స్థానాలు వస్తాయని తొలి నుంచి చెబుతున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎల్పీ నిర్ణయం మేరకు జరుగుతుందని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లాలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎవరైనా అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తామని ాయన తెలిపారు.
Next Story

