Mon Feb 02 2026 12:25:45 GMT+0000 (Coordinated Universal Time)
రాజయ్య కుటుంబానికి భారీ ఊరట
మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్యకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.

మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్యకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. రాజయ్య కోడలుతో పాటు ముగ్గురు పిల్లలు సజీవ దహనం కేసులో ఆయనను నిర్దోషిగా హైదరాబాద్ స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. 2015 నవంబరు 4వ తేదీన రాజయ్య కోడలు సారిక తన ముగ్గురి పిల్లలతో సజీవ దహనమయింది. అయితే ఈ కేసులో రాజయ్య కుమారుడు అనిల్, ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సజీవ దహనం కేసులో.....
ఒకే ఇంట్లో నివాసముంటున్న వారు సజీవ దహనం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజయ్య రాజకీయ జీవితానికి కూడా ఈ ఘటన ఇబ్బంది కలిగించింది. పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అయితే కేసును విచారించిన న్యాయస్థానం మాత్రం ఈ ముగ్గురిని నిర్దోషులుగా నిర్ణయిస్తూ తీర్పు చెప్పింది. రాజయ్య కుటుంబానికి భారీ ఊరట లభించింది.
Next Story

