Sun Mar 08 2026 04:52:11 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి పొంగులేటి ఆత్మీయ సమావేశాలు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేటి నుంచి నియోజకవర్గాల వారీగా ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేటి నుంచి నియోజకవర్గాల వారీగా ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. తొలిసారి పినపాక నియోజకవర్గం నుంచి ఆయన ఆత్మీయ సమావేశం మొదలు పెడుతున్నారు. ఈ సమావేశానికి భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని పొంగులేటి అనుచరులకు ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఈ ఆత్మీయ సమావేశం మరికాసేపట్లో జరగనుంది.
పినపాక నుంచి...
విడతల వారీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ చేరికపై ఒక నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. పది నియోజకవర్గాల్లో తన అనుచరులకు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
Next Story

