Sun Mar 15 2026 07:41:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బీజేపీ గూటికి కొండా
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ నెల 1వ తేదీన బీజేపీలో చేరనున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాల సందర్భంగా ఆ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ నెల 1వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన అంగీకరించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు మంతనాలు జరిపారు. బీజేపీలో చేరేందుకు ఆయన అంగీకరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నడ్డా సమక్షంలో...
ఈ నెల 1వ తేదీన పార్టీ జాతీయ కార్యవర్గాల సమావేశాల కోసం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నగరానికి వస్తున్నారు. ఆయన సమక్షంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ కండువా కప్పుకోనున్నారు. విశ్వేశ్వర్ రెడ్డితో పాటు జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందుగానే మరికొంత మంది నేతలను చేర్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరికొందరు కీలక నేతలు కూడా బీజేపీ లో చేరే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి.
Next Story

