Sun Mar 15 2026 11:30:16 GMT+0530 (India Standard Time)
BRS : బీఆర్ఎస్ కు కీలక నేత రాజీనామా
నాగార్జున సాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరొక కీలక నేత రాజీనామా చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు తనకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వస్తుందని ఆశించారు.
టిక్కెట్ ఆశించి...
కానీ పిలుపు రాకపోగా నల్లగొండ పార్లమెంటు స్థానాన్ని కంచర్ల కృష్ణారెడ్డికి కేటాయించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపారు. త్వరలో ఏ పార్టీలో చేరనున్నది ఆయన వెల్లడించానున్నారు.
Next Story

