Sun Oct 13 2024 21:12:16 GMT+0000 (Coordinated Universal Time)
హరీశ్ పై మైనంపల్లి హాట్ కామెంట్స్
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై మండిపడ్డారు
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై మండిపడ్డారు. ఈరోజు మల్లవరం ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన బాదితులను ఆయన ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ హరీశ్ రావు భూముల మీదుగా వెళ్లకుండా రీజనల్ రింగ్ రోడ్డును తప్పించారని ఆయన అన్నారు.
ఎందుకు తప్పించారు?
హరీశ్ రావు భూముల నుంచి ఎందుకు తప్పించారని మైనంపల్లి ప్రశ్నించారు. హరీశ్ రావు భూములు పోకుండా గత ప్రభుత్వం డిజైన్ ను మార్చిందన్న మైనంపల్లి హరీశ్ రావు భూముల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వెళ్లేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటివద్ద తాను ధర్నాకు దిగుతానని తెలిపారు.
Next Story