Thu Mar 19 2026 06:08:05 GMT+0530 (India Standard Time)
కోమటిరెడ్డికి కండువా కప్పిన అమిత్ షా
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు

మునుగోడు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన వెంటనే ఆయన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిన ఆలింగనం చేసుకున్న అమిత్ షా ఆయనను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలోకి ఆహ్వానించి....
అమిత్ షా ప్రత్యేక హెలికాప్టర్ లో మునుగోడుకు చేరుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ లు వచ్చారు. వేదిక పైకి వచ్చిన వెంటనే నిర్వాహకులను పిలిచి కమలం కండువాను తీసుకుని మరీ అమిత్ షా కోమటిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
Next Story

