Sun Mar 15 2026 18:38:05 GMT+0530 (India Standard Time)
మాజీ ఎమ్మెల్యే మృతి
తెంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మరణించారు

తెంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 70 ఏళ్లు. అబ్బయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఉమ్మడి ఏపీలో...
ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 2009లో ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. అబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.
Next Story

