Sat Jul 12 2025 22:29:13 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ వల్ల నా ప్రాణాలకు ముప్పు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మరోసారి మండి పడ్డారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మరోసారి మండి పడ్డారు. రేవంత్ రెడ్డి చర్యలతో మాదిగలు యాభై ఏళ్ల పాటు వెనక్కు వెళుతున్నారన్నారు. వంద రోజుల పాలనలో రేవంత్ నిజ స్వరూపం ఏదో అర్థమయిందని అమ్ముకున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మాదిగలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్యాయం చేశారన్నారు.
డబ్బుల కోసం..
రేవంత్ డబ్బుల కోసం టిక్కెట్లు అమ్ముకున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి రేవంత్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రేవంత్ వల్ల తనకు ప్రాణభయం ఉందన్నారు. మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు.
Next Story