Sun Dec 14 2025 01:45:19 GMT+0000 (Coordinated Universal Time)
Malla Reddy : మాస్ డ్యాన్స్తో అదరగొట్టిన మల్లారెడ్డి
మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఏడు పదుల వయసులోనూ ఆయన ఉత్సాహంగా కనిపిస్తారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఏడు పదుల వయసులోనూ ఆయన ఉత్సాహంగా కనిపిస్తారు. పలు ఫంక్షన్లలో ఆయన స్టెప్పులు వేస్తూ కనపడతారు. ఆయన ఏదీ మనసులో దాచుకోరు. తాను అనుకున్నది అనుకున్నట్లు చెబుతారు. తాను అనుకున్నదే చేస్తారు. ఒకరు ఏదో అనుకుంటారని ఆయన సిగ్గుపడరు. వెనక్కు తగ్గరు. కొరియోగ్రాఫర్ల వద్ద వారం రోజుల నుంచి శిక్షణ తీసుకుని మరీ డ్యాన్స్లు వేయడం ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనవరాలి సంగీత్ లో...
మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలు వివాహం త్వరలో జరగనుంది. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి సంగీత్ కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. సంగీత్ ఫంక్షన్ లో మల్లారెడ్డి డ్యాన్స్ దుమ్ము దులిపారు. చాలా పాటలకు ఆయన డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు. దీంతో చూసేవారందరూ రిపీట్ అంటూ గోల చేయడంతో పాటు ఈలలు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మల్లారెడ్డి ఎప్పుడూ హుషారుగానే ఉంటూ అందరి దృష్టిలో పడతారు. అందుకే మల్లారెడ్డి వెరీ వెరీ స్పెషల్ అంటారు అందరూ.
Next Story

