Fri Dec 05 2025 12:21:29 GMT+0000 (Coordinated Universal Time)
Malla Reddy : ఇక పోటీ చేసేది లేదు.. పార్టీ మారేది లేదు
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మల్లారెడ్డి తెలిపారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కేవలం వ్యాపార నిమిత్తమే డీకే శివకుమార్ను కలిశానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
అందుకే డీకేను కలిశా...
యూనివర్శిటీ కోనుగొలు విషయంలో తనను ఒక మధ్యవర్తి డీకే శివకుమార్ వద్దకు తీసుకెళ్ళారని మల్లారెడ్డి తెలిపారు. ఐదేళ్లు తాను బీఆర్ఎస్ను వీడేది లేదని చెన్పారు. ప్రస్తుతం తన నా వయసు 75ఏళ్లు అని, రానున్న ఎన్నికలలో తాను పోటీ చేయనని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీని వీడుతున్నట్లు వార్తలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని ఆయన తెలిపారు.
Next Story

