Mon Mar 16 2026 06:20:34 GMT+0530 (India Standard Time)
కోటి ఇస్తామన్నా అమ్ముడు పోలేదు
కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్టీ మారితే కోటి ఇస్తామన్నా తాను అమ్ముడు పోలేదని ఆయన తెలిపారు. తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో 13 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నానని ఆయన గుర్తు చేశారు. ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
వత్తిడులు వస్తున్నా....
ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. తనపై వత్తిడులు వస్తున్న మాట వాస్తవమేనని, అయితే తాను దేనికీ లొంగే వ్యక్తిని కాదని, కార్యకర్తల కోరిక మేరకు తన నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు.
Next Story

