Fri Dec 05 2025 14:13:51 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao : నేడు ఖమ్మం జిల్లాకు హరీశ్ రావు
మాజీ మంత్రి హరీశ్ రావు నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం నగరంతో పాటు చింతకాని మండలంలో హరీశ్ రావు పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల పాటు ఆయన ఖమ్మం జిల్లాలోనే మకాం వేస్తారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. లగచర్ల రైతులకు మద్దతుగా ఖమ్మంలో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో హరీశ్ రావు పాల్గొంటారు.
రైతు సమస్యలపై...
అనంతరం బీఆర్ఎస్ నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. తర్వాత పత్తి, మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను హరీశ్ రావు సందర్శిస్తారు. చింతకాని మండలంలో రైతులను పరామర్శిస్తారు.
Next Story

