Fri Dec 05 2025 09:26:23 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు హరీశ్
కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరు కానున్నారు

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరు కానున్నారు. ఈరోజు ఉదయం బీఆర్కే భవన్ లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుటకు హరీశ్ రావు హాజరు కానున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు హరీశ్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటంతో ఆయనను విచారించేందుకు కమిషన్ నోటీసులు జారీ చేసింది.
114వ వ్యక్తిగా...
ఇప్పటి వరకూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 113 మందిని విచారించింది. నేడు హరీశ్ రావును 114 వ్యక్తిగా విచారణకు హాజరవుతున్నారు. మేడికడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అక్కడ నిర్మించడంపై తీసుకున్న నిర్ణయంపైనే ప్రధానంగా హరీశ్ రావును ప్రశ్నించనున్నారు. దీంతో పాటు ఆర్థిక పరమైన అంశాలను కూడా హరీశ్ రావును అడిగి తెలుసుకోనుంది. దీంతో హరీశ్ రావు కమిషన్ ఎదుట ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ఎదుటకు విచారణకు హాజరవుతారు.
Next Story

