Wed Feb 04 2026 11:51:21 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao : తెలంగాణకు ఆ రెండు పార్టీలే విలన్లు
తెలంగాణను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

తెలంగాణను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండు పార్టీలకు లకు చెరో ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రా తీపి అయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపించిందన్నారు.
ఏపీ తీపి అయిందా?
తెలంగాణ కేంద్ర ప్రభుత్వం చేదు అయిందా అని హరీశ్ రావు అన్నారు. మేడగడ్డలో రెండు పిల్లర్స్ కూలిపోతే కాళేశ్వరం మొత్తం కూలిపోయినట్లు ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం కూలిపోతే రంగనాయక సాగర్లో నీళ్లు ఎలా వచ్చాయని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు ఇక బీజేపీ న్యాయం చేయదని అర్థమయిందన్నారు.
Next Story
