Sat Jan 31 2026 16:37:18 GMT+0000 (Coordinated Universal Time)
Harsh Rao : రేవంత్ రెడ్డిది కవర్ పాయింట్ ప్రెజెంటేషన్
మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు నేడు హాజరయ్యారు.

మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు నేడు హాజరయ్యారు. విచారణ నుంచి ముగించుకుని వచ్చిన తర్వాత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తన వద్ద ఉన్న పూర్తి వివరాలను కమిషన్ కు ఇచ్చానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడు సార్లు శాసనసభ ఆమోదం పొందిందని, ఆరు సార్లు మంత్రివర్గం చర్చించి ఆమోదించిందని, దీనికి సంబంధించి వివరాలను పుస్తక రూపంలో కమిషన్ కు ఇచ్చానని హరీశ్ రావు తెలిపారు.
ఆరు సార్లు కేబినెట్ లో చర్చించి...
ఆరు సార్లు కేబినెట్ లో చర్చించి ఆమోదించామంటే మొత్తం మంత్రివర్గం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.పీసీ ఘోష్ కమిషన్ కు ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇచ్చిందో తనకు తెలియదని హరీశ్ రావు అన్నారు. తాము అడిగితే ప్రభుత్వం వివరాలను ఇవ్వడం లేదని చెప్పారు. రెండు రోజుల క్రితం నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రెజెంటషన్ కాదని, కవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని తెలిపారు. తెలంగాణకు నీటి విషయలో ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.
Next Story

