Fri Dec 05 2025 13:36:04 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో గెలుపు గెలుపే కాదు
కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో బీజేపీ సత్తా చాటిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో బీజేపీ సత్తా చాటిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అధికార పార్టీ అన్ని రకాల అరాచకాలకు పాల్పడిందన్నారు. 35 వేల మంది గొల్ల కురుమలకు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమ చేశారన్నారు. మహిళ సంఘాలకు కూడా బ్యాంకుల్లోనే నగదు జమ చేశారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అధికారులు అందరూ టీఆర్ఎస్ కు సహకరించారని ఈటల ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై తమను ఇబ్బంది పెట్టారన్నారు.
డబ్బులు పంచి...
పోలీసులు టీఆర్ఎస్ డబ్బులను చేరవేశారని ఆయన అన్నారు. చట్టానికి లోబడి పోలీసులు పనిచేయలేదన్నారు. టీఆర్ఎస్ ను గెలిపించడానికే వాళ్లు కృషి చేశారన్నారు. ఓటుకు ఐదువేల రూపాయలు ఇచ్చారని అన్నారు. మునుగోడులో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదన్నారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు జరిపి డబ్బు, మద్యాన్ని విపరీతంగా పంచారని, అంత చేసినా మెజారిటీ స్వల్పంగానే వచ్చిందన్నారు.
Next Story

