Thu Mar 19 2026 06:26:08 GMT+0530 (India Standard Time)
నేడు డీఎస్ అంత్యక్రియలు
మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు నిజామాబాద్ లో జరగనున్నాయి

మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం నిజామాబాద్ లో డీఎస్ పార్థీవదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మధ్యాహ్నం పన్నెండు గంటల కు నిజామాబాద్ లోని డీఎస్ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.
నిజామాబాద్ కు సీఎం....
మృతి చెందిన డీఎస్ కు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ బయలుదేరి వెళుతున్నారు. ఆయన నిజామాబాద్ వెళ్లి డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నిన్న హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.ఈరోజు ఆయన అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.
Next Story

