Sun Mar 08 2026 06:02:39 GMT+0530 (India Standard Time)
ఆసుపత్రిలో చేరిన డీఎస్
రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు

రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనేకసార్లు ఆసుపత్రిలో చేరి తిరిగి ఆయన క్షేమంగానే ఇంటికి చేరుకున్నారు. అనేక అనారోగ్య సమస్యలతో డీఎస్ బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ తెలిపారు.
ట్వీట్ చేయడంతో...
ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోను అరవింద్ ట్వీట్ చేశారు. కాగా, డీఎస్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ లో కీలక నేతగా పనిచేసిన డీఎస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. తిరిగి గతేడాది డీఎస్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అయితే డీఎస్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Next Story

