Sun Mar 08 2026 04:50:07 GMT+0530 (India Standard Time)
దమ్ముంటే .. నన్ను సస్పెండ్ చేయండి
బీఆర్ఎస్ హైకమాండ్ కు మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ హైకమాండ్ కు మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. తనను నమ్ముకున్న నేతలను సస్పెండ్ చేయడం కాదని, దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఛాలెంజ్ చేశారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉందో లేదో అన్నది అధినాయకత్వమే చెప్పాలన్నారు. మొన్నటి వరకూ తన ఫొటోను ఎందుకు వాడుకున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. గతంలో మీ గెలుపు కోసం తనను ప్రాధేయపడిన విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు.
అభిమానుల నిర్ణయం మేరకే...
పొంగులేటి అనుచరులను ఇరవై మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. తనకు పార్టీ సభ్యత్వం లేనప్పుడు తనను ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. తన వెంట ప్రజలతో పాటు కార్యకర్తలున్నారన్న విషయాన్ని మరచిపోవద్దని హెచ్చరించారు. తన అభిమానుల నిర్ణయం మేరకే పార్టీ మార్పు ఉంటుందని ఆయన ప్రకటించారు. అంతే తప్ప ఎవరికీ భయపడబోనని ఆయన చెప్పారు. కొందరు రెచ్చగొట్టినంత మాత్రాన తాను నిర్ణయం తీసుకోబోనని తెలిపారు. ఎంతమందిని సస్పెండ్ చేస్తారో చేసుకొమ్మని పొంగులేటి మండిపడ్డారు.
Next Story

