Sat Mar 07 2026 16:34:52 GMT+0530 (India Standard Time)
Vivek : నేను పార్టీ మారడం లేదు బాబోయ్
తాను పార్టీ మారడం లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వివేక్ తెలిపారు

తాను పార్టీ మారడం లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వివేక్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై గత కొంత కాలంగా పార్టీ మారతారని ప్రచారం జరుగుతుందని అన్నారు. కానీ అది ఒట్టి ప్రచారం మాత్రమేనని, తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని గడ్డం వివేక్ తెలిపారు.
పెద్దపల్లి నుంచి...
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి తాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని గడ్డం వివేక్ మీడియాకు తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్న విషయం తనకు తెలియదన్న వివేక్ తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
Next Story

