Mon Feb 02 2026 16:11:11 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ గవర్నర్ నేడు మెదక్ లో
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గవర్నర్ గా తనకున్న పరిచయాలతో పాటు ఆమె ప్రచారంతో పార్టీకి మరింత లాభం చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఆమె తమిళనాడు నుంచి ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు.
మెదక్, జహీరాబాద్ స్థానాలకు చెందిన...
తమిళి సై సౌందర్ రాజన్ ను పార్టీ అగ్రనాయకత్వం సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా నియమించింది. ఈరోజు తమిళి సై సౌందర్ రాజన్ సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరనున్నారు. తమిళి సై సౌందర్ రాజన్ మెదక్, జహీరాబాద్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
Next Story

