Thu Dec 18 2025 22:56:04 GMT+0000 (Coordinated Universal Time)
కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనలతో రోశయ్య అంత్యక్రియలను నిర్వహించారు.

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనలతో రోశయ్య అంత్యక్రియలను కొంపల్లి ఫాంహౌస్ లో నిర్వహించారు. తొలుత గాంధీ భవన్ లో కొద్దిసేపు ఉంచిన రోశయ్య పార్థీవ దేహానికి కాంగ్రెస్ నేతలు, అభిమానులు నివాళులర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే గాంధీభవన్ లో నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా కొంపల్లిలోని ఫాంహౌస్ కు తరలించారు.
రెండు రాష్ట్రాల నుంచి...
మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా రోశయ్య చేసిన సేవలను కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీలకతీతంగా నేతలు రోశయ్యను కడసారి చూసేందుకు తరలి వచ్చారు. అంత్యక్రియలకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, హనుమంతరావులు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. రోశయ్య కేబినెట్ లో అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారందరూ హాజరై నివాళులర్పించారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Next Story

