Wed Mar 18 2026 21:46:42 GMT+0530 (India Standard Time)
నేడు రోశయ్య అంత్యక్రియలు
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. కొంపల్లిలోని ఆయన ఫాంహౌస్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. కొంపల్లిలోని ఆయన ఫాంహౌస్ లో ఈ కార్యక్రమం జరగనుంది. మరికాసేపట్లో కొణిజేటి రోశయ్య పార్ధీవ దేహాన్ని గాంధీభవన్ కు తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. అక్కడి నుంచి నేరుగా కొంపల్లిలోని రోశయ్య వ్యవసాయ క్షేత్రానికి తరలించి అంత్యక్రియలను నిర్వహిస్తారు.ః
గాంధీ భవన్ లో...
రోశయ్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ చేరుకున్నారు. జాతీయ స్థాయి నేతలు కూడా నేడు హైదరాబాద్ కు రానున్నారు. రోశయ్యను కడసారి వీడ్కోలు చెప్పేందుకు ఆత్మీయులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు.
Next Story

