Fri Mar 20 2026 06:17:22 GMT+0530 (India Standard Time)
KCR : త్వరలో తాను జనంలోకి వస్తా
త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడతూ తెలంగాణ ప్రజలు నేటికీ బీఆర్ఎస్ ను విశ్వసిస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందన్న కేసీఆర్ పార్లమెంటు సమావేశాల్లో పార్టీ తరుపున గళం బలంగా వినిపించాలని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో...
రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పిన కేసీఆర్ వాటి కోసం పార్లమెంటులో కొట్లాడాలని ఎంపీలను ఆదేశించారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలు అయ్యేలా సమావేశాల్లో ప్రశ్నించాలన్నారు. తెలంగాణ ప్రజలు భారత రాష్ట్ర సమితిపైనే ఆశలు పెట్టుకున్నారన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు నష్టం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

