Fri Dec 05 2025 14:44:51 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ కీలక ప్రకటన.. ఆగం కావద్దంటూ?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ తెలిపారు. కష్టకాలంలో ప్రజలు కూడా కొంత సంయమనం పాటించాలని కోరారు. వచ్చేది మన్ ప్రభుత్వమేనని అన్నారు. అన్ని కాలాలుమనకు కలసి రావని, కొన్నిసార్లు కష్టాలు వస్తాయని వాటికి వెరవకూడదని కేసీఆర్ నేతలతో చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సాపురం గ్రామ సర్పంచ్, ఆ రెండు గ్రామాల ప్రజలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు.
వచ్చేది మన ప్రభుత్వమేనంటూ...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరో ఏదో చేస్తారని భావించి ఆగం కావద్దని కేసీఆర్ అన్నారు. తెలంగాణ పల్లెలకు మంచిరోజులు వస్తాయని, అప్పటి వరకూ ప్రజలు అధైర్య పడవద్దని కేసీఆర్ తెలిపారు. గ్రామాభివృద్ధికి కమిటీలు వేసుకుని పల్లెలు బాగుపడేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకోవాలని కేసీఆర్ ఈ సమావేశంలో తెలిపారు. వచ్చేది మన ప్రభుత్వమేనని అన్నారు.
Next Story

