Fri Dec 05 2025 13:36:04 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ నివేదిక పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటీషన్ వేశారు. కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.

కాళేశ్వరం కమిషన్ నివేదిక పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటీషన్ వేశారు. కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటీషన్ వేశారు. కేసీఆర్, హరీశ్ రావులు వేర్వేరుగా రెండు పిటీషన్లు వేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేశారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో...
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కమిషన్ నివేదిక ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో అది కమిషన్ నివేదికలో పొందుపర్చిందని తెలిపారు. కమిషన్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని, దీనిపై స్టే ఇవ్వాలంటూ కేసీఆర్, హరీశ్ రావులు వేర్వేరుగా పిటీషన్లు హైకోర్టులో దాఖలు చేశారు.
Next Story

