Fri Dec 05 2025 13:20:19 GMT+0000 (Coordinated Universal Time)
విచారణ చేపట్టే ఛాన్స్ సీబీఐకి లేదా? లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?
కాశేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు సీబీఐకి అవకాశముంటుందా? అన్న ప్రశ్నకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్నితెలిపారు

కాశేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు సీబీఐకి అవకాశముంటుందా? అన్న ప్రశ్నకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్నితెలిపారు.కాళేశ్వరం లో పాత్ర ఉన్నది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనని, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను విచారించే అధికారం సీబీఐ కి ఉండదని లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన సీబీఐ విచారణ చేపట్టలేదని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం అంగీకరించి...
కేంద్రం కూడా అందుకు ఒప్పుకోవాలని, ఒప్పుకుంటూ కేంద్రం సెక్షన్ 5 నోటిఫికేషన్ జారీ చేస్తేనే సీబీఐ కి అనుమతి వచ్చినట్లుగా భావించాలని లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే సాధారణ అంగీకారం వల్ల సీబీఐ కేసు విచారణ చేపట్టడం సాధ్యం కాదని, సుగాలి ప్రీతి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నోటిఫికేషన్ ఇచ్చినా.. కేంద్రం సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు కాబట్టే కేసు నిలిచిపోయిందని లక్ష్మీనారాయణ చెప్పారు.
Next Story

