Fri Jan 30 2026 00:04:58 GMT+0000 (Coordinated Universal Time)
BJP : హరీశ్ రావుకు తెలియకుండానే వారు సీఎంను కలిశారా?
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు

బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం వెనక హరీశ్ రావు ఉన్నారన్నారు. ఆయనకు తెలియకుండానే ముఖ్యమంత్రిని మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తారా? అని రఘునందనరావు ప్రశ్నించారు. హరీశ్ రావు ప్రోద్బలం మేరకే నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి వచ్చినట్లు అందరికీ అర్ధమవుతుందని తెలిపారు. ఏ ఉద్దేశ్యంతో వారు కలిశారో చెప్పాలన్నారు.
కుటుంబంలో విభేదాలు...
కాంగ్రెస్ లో చేరేందుకు కలిశారా? లేక హరీశ్రావు మరేదైనా కారణం చెప్పి వారిని ముఖ్యమంత్రి వద్దకు పంపారా? అని రఘునందనరావు ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు స్థానంలో అభ్యర్థిపై కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ గొడవల కారణంగానే బీఆర్ఎస్ హైకమాండ్ కు హరీశ్ రావు మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వద్దకు పంపి పరోక్షంగా హెచ్చరికలు పంపారని అర్థమవుతుందని రఘునందన్ రావు తెలిపారు.
Next Story

