Sun Mar 15 2026 09:35:43 GMT+0530 (India Standard Time)
Breaking : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి
ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ మరణించారు.

ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ మరణించారు. ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన రమేష్ రాథోడ్ ను హైదరాబాద్ కు తరలిస్తుండగా కన్నుమూశారు. ఆయన కిడ్నీ సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్నారని తెలిసింది. రమేష్ రాథోడ్ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమయింది. ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా,
అనంతరం ఆయన బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఇటీవల రమేష్ రాథోడ్ బీజేపీలో చేరారు. రమేష్ రాథోడ్ ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆదిలాబాద్ లోక్సభ నుంచి గెలుపొందారు. ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

