Thu Mar 19 2026 02:50:14 GMT+0530 (India Standard Time)
Tiger : తెలంగాణ సరిహద్దుల్లోనే ఆ పులి..ముగ్గురిని చంపేసిన పులి కోసం?
తెలంగాణ సరిహద్దుల్లోనే పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు

మహరాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో పులిని బంధించేందుకు అధికారులు డిసైడ్ అయ్యారు. అటవీ శాఖ అధికారులు ఈమేరకు మహారాష్ట్ర సర్కార్ కు లేఖ రాశారు. పులిని బందించడానికి అనుమతి ఇవ్వాలని చంద్రపూర్ అటవీ అదికారులు మహరాష్ట్ర పీసీసిఎఫ్ కు లేఖ రాశారు. అనుమతి రాగానే పులిని బందిస్తామంటున్నారు. మహరాష్ట్ర లో చంద్రపూర్ జిల్లాలో ఇద్దరిని పులి చంపేసింది. తెలంగాణలోని కుమరం భీం జిల్లాలో ఒకరిని చంపి మరోకరిని తీవ్రంగా గాయపరిచింది. మనిషి రక్తాన్ని రుచిమరిగిన పులిని బంధించేందుకు అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లో మొత్తం ఎనిమిది పులులు తిరుగుతున్నట్లు గుర్తించారు.
దూకుడు మీద ఉండటంతో...
ఈ సమయంలో పులి చాలా దూకుడు మీద ఉంటుందని, అందుకే మనుషులపై దాడి చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే పులిని ట్రేస్ చేయడం కోసం అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ. ,మహరాష్ట్ర. సరిహద్దులో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కుమరం భీం జిల్లా ఇటిక్యాల్ పహడ్ కు అతి సమీపంలో పులి సంచరిస్తుంది. పులి భయంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులిని ప్రాణాలతో బంధించేందుకు అనుమతి రాగానే అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

