Wed Dec 17 2025 19:14:46 GMT+0000 (Coordinated Universal Time)
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద నీరు
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద నీరు కొనసాగుతుంది. పథ్నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద నీరు కొనసాగుతుంది. పథ్నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,62285 క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 586.50 అడుగులుగా ఉంది.
పర్యాటకుల సంఖ్య...
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత సామర్థ్యం : 302.9125 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరొకవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

