Fri Dec 05 2025 21:35:21 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోతున్నాయి

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. నాగార్జున సాగర్ లోనూ వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో నాగార్జున సాగర్ గేట్లను మరోసారి ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లోని రెండు గేట్లను ఐదు అడుగుల మేరకు పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పూర్తి స్థాయి నీటిమట్టం...
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులకు చేరింది. ఆదివారం కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాటిని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశముంది. ఈ మేరకు పోలీసులు డ్యామ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

