Tue Jan 20 2026 04:49:04 GMT+0000 (Coordinated Universal Time)
Nagarjun Sagar : జలకళతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండింది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది.
కుండపోత వర్షాలతో....
ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 65,842 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 1,09,952 అడుగులుగా ఉంది. మరొకవైపు ఈరోజు కూడా తెలంగాణకు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్లు ఎత్తిన సాగర్ ను చూసేందుకు ఇప్పటికే పర్యాటకులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

