Thu Mar 19 2026 14:16:18 GMT+0530 (India Standard Time)
రైతుల ఆత్మహత్యలపై రేవంత్ ఘాటు లేఖ
ప్రతి రోజూ ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

ప్రతి రోజూ ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వరి రైతులు ధాన్యం కొనుగోలు జరగక ఇబ్బంది పడుతుంటే, మిర్చి రైతుల ఆత్మహత్యలు ఆందోళన కల్గిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. మిర్చి రైతులు సరైన గిట్టు బాటు ధర లేక ఉరితాళ్లకు వేళ్లాడుతుండటం కలచి వేస్తుందన్నారు.
పది లక్షల పరిహారాన్ని.....
ఈ ప్రభుత్వం ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా దున్నపోతుపై వర్షం పడినట్లు వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, సూర్యాపేట్, నల్లగొండ జిల్లాల్లో 3.58 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేశారని తెలిపారు. అయితే ఈ ఏడాది తామర పురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగులు వంటి సోకి పంట నాశనమయిందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడున్నరేళ్ల పాలనలో 40 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.
- Tags
- revanth reddy
- kcr
Next Story

