Fri Mar 20 2026 15:12:19 GMT+0530 (India Standard Time)
గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతు
గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతయ్యారు

గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్ పురుషోత్తమపట్నం పంచాయతీ పరిధిలోని కొల్లుగూడెం సమీపంలో ఈ ఘటన జరిగింది. భద్రాచలం పట్టణానికి చెందిన ఐదుగురు గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. ఏడుగురు గోదావరి నదిలో స్నానానికి దిగగా, అందులో ఐదుగురు గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు లోతుకు వెళ్లకపోవడంతో బయటపడ్డారు. గోదావరి లోతు తెలియకనే గల్లంతయ్యారని చెబుతున్నారు.
రెండు రాష్ట్రాల పోలీసులు...
వెంటనే ఒడ్డున ఉన్న మిగిలిన ఇద్దరు డయల్ 100 కి సమాచారం ఇవ్వడంతో వారు భద్రాచలం పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అయితే భద్రాచలం పోలీసులు ఏపీ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని తెలిపారు. భద్రాచలం, ఎటపాక పోలీసులు సంయుక్తంగా గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గల్లంతయిన వారిలో కొందరు భద్రాద్రి రామాలయంలో పనిచేసే సిబ్బంది పిల్లలని చెబుతున్నారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Next Story

