Sat Mar 07 2026 18:41:58 GMT+0530 (India Standard Time)
తొలిరోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్సీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ప్రారంభయ్యాయి. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ప్రారంభయ్యాయి. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తొలి రోజు అసెంబ్లీ సమావేశానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరి వచ్చారు. ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ అసెంబ్లీకి రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు.
ఉచిత ప్రయాణంపై...
ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అని ప్రశ్నించారు. మహిళలు మాత్రం ఉచిత బస్సు ప్రయాణాలపై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు.
Next Story

