Thu Mar 19 2026 02:06:23 GMT+0530 (India Standard Time)
Breaking : నిర్మల్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగులందరినీ బయటకు
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. రోగులను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్థులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రిలోని రోగులను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు రెండో అంతస్థుకు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో రోగులంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే వారందరినీ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకు వచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే...
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాధమిక విచారణలో తేలిందన్నారు. రెండో అంతస్థులో చెలరేగిన మంటలు పక్కకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంటలు అదుపులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Next Story

