Thu Mar 19 2026 08:50:08 GMT+0530 (India Standard Time)
పాశమైలారం పరిశ్రమల్లో భారీ అగ్నిప్రమాదం
అక్కడున్న డ్రమ్ములకు మంటలు అంటున్నాయి. మంటలు పరిశ్రమ మొత్తానికి వ్యాపించడంతో యంత్రాలు తగలబడ్డాయి.

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పటాన్ చెరుమండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పెయింట్, రసాయన పరిశ్రమల్లో శనివారం మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. తొలుత పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగగా.. వాటిని అదుపుచేయలేకపోవడంతో.. పక్కనున్న రసాయన పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి.
అక్కడున్న డ్రమ్ములకు మంటలు అంటున్నాయి. మంటలు పరిశ్రమ మొత్తానికి వ్యాపించడంతో యంత్రాలు తగలబడ్డాయి. మంటలను అదుపుచేసేందుకు సంగారెడ్డి, పటాన్చెరు, బీడీఎల్, బొల్లారం ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడంతో పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story

