Tue Feb 03 2026 08:32:08 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు హరీశ్‌రావు భరోసా
సిద్ధిపేట అర్బన్ మండలంలో వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు

సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామంలో వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిిపారు.
పరిహారం...
రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
Next Story

