Thu Mar 19 2026 22:27:14 GMT+0530 (India Standard Time)
15 మంది పోలీసులకు కరోనా
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదిహేను మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు

పోలీసులను కరోనా వదిలిపెట్టడం లేదు. థర్డ్ వేవ్ లో పోలీసులను కరోనా ఇబ్బంది పెడుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదిహేను మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరంతా జాతరలో పాల్గొని రావడంతోవీరికి కరోనా సోకినట్లు చెబుతున్నారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, పన్నెండు మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది.
జాతరలో పాల్గొని...
మల్లికార్జునస్వామి జాతరలో విధులు నిర్వహించి వచ్చిన వారిలో ఎనిమిది మందికి కరోనా సోకింది. ఈ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు ప్రత్యేకంగా పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. బూస్టర్ డోస్ తీసుకుని విధులు నిర్వహిస్తున్నా కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

