Fri Dec 05 2025 19:09:49 GMT+0000 (Coordinated Universal Time)
నిజామాబాద్ లో పెద్ద పులి అడుగులు చూసి భయం భయంగా!!
నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తోందని అధికారులు తెలిపారు. సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తూ ఉందన్నారు.

నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తోందని అధికారులు తెలిపారు. సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తూ ఉందన్నారు. సిరికొండ, కమ్మర్పల్లి, తాటిపల్లి, జినిగ్యాల బీటు పరిధిలోని మల్లంకుంట చెరువు, లీంట్లకుంట, జినిగ్యాల చెరువు ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు సమాచారం అందగానే యానిమల్ ట్రాకర్స్తో అటవీ ప్రాంతంలోకి ఫారెస్ట్ అధికారులు వెళ్లారు. పులి అడుగు జాడలు గుర్తించామని, వాటిని పరిశీలించగా అవి మగ పెద్దపులి అడుగులుగా నిర్ధారించామన్నారు. ఈ పులి గతంలో ఏటీఆర్ ఖానాపూర్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుండేదని, పేరు ఎస్ 12 అని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, పులి ఆనవాళ్లు, కదలికలు గుర్తిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Next Story

