Sat Dec 13 2025 22:34:55 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఆదిలబాద్ లో ఛలో భోరాజ్
ఆదిలాబాద్ జిల్లాలో నేడు రైతులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపు నిచ్చారు.

ఆదిలాబాద్ జిల్లాలో నేడు రైతులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపు నిచ్చారు. నేడు ఛలో బోరాజ్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొంటున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చలో భోరాజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అఖిలపక్షంతో కలసి బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
జాతీయ రహదారుల దిగ్బంధనానికి...
కపాస్ కిసాన్ యాప్ రద్దుతో పాటు పత్తిని పరిమితి విధించకుండా కొనుగోలు చేయాలన్న ప్రధాన డిమాండ్ తో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనుంది. దీంతో జాతీయ రహదారులపై పెద్దయెత్తున వాహనాలు నిలిచిపోయే అవకాశమున్నందున పోలీసులు భారీ భ్రదతను ఏర్పాటు చేశారు. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story

