Sat Feb 15 2025 23:21:09 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు కొమురవెల్లి మల్లన్న జాతర
తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన కొమురవెల్లి మల్లన్న జాతర నేడు జరగనుంది.

తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన కొమురవెల్లి మల్లన్న జాతర నేడు జరగనుంది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం ఈ జాతర జరుగుతుంది. జాతర తొలి ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండగ ముగిసిన తర్వాత ఈ జాతర ప్రతి ఏటా జరుగుతుంది. ఉగాది పండగకు ముందు వచ్చే ఆదివారం వరకూ కొమురవెల్లి మల్లన్న జాతరను నిర్వహిసంచనున్నారు.
భక్తులకు సౌకర్యం కోసం...
ఇప్పటికే భక్తులు జాతర ప్రాంతానికి చేరుకుని ధూళి దర్శనం చేసుకున్నారు. జాతర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో ఆదివారం మాత్రం లష్కర్ వారంగా పిలుస్తారు. ఈ లష్కర్ వారం రోజు ఎక్కువ మంది సికింద్రాబాద్ నుంచి భక్తులు తరలి వస్తారని అధికారులు తెలిపారు.
Next Story