Sun Feb 01 2026 13:59:01 GMT+0000 (Coordinated Universal Time)
తుమ్మిడికుంటలో సెంటు భూమిని కూడా ఆక్రమించలేదు
అభిమానులకు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంపై క్లారిటీ ఇచ్చారు

అభిమానులకు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయన్న నాగార్జున కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని తెలిపారు.
తుమ్మిడి కుంట చెరువును...
ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదని, తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టు 2014లోనే తీర్పుచెప్పడం జరిగిందన్నారు. ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, న్యాయస్థానం తీర్పు కి ీను కట్టుబడి ఉంటానని నాగార్జున తెలిపారు.. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మవద్దని కోరుతున్నానని చెప్పారు.
Next Story

