Thu Mar 19 2026 07:18:24 GMT+0530 (India Standard Time)
మానవత్వం చాటుకున్న అలంపూర్ ఎమ్మెల్యే
అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వీఎమ్ అబ్రహం మానవత్వం చాటుకున్నారు.

అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వీఎమ్ అబ్రహం మానవత్వం చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన వాహనంలో హాస్పటల్‌కు తరలించారు. ఇటిక్యాల మండలం కొండేరు గ్రామనికి చెందిన మహిళా కూలీలు టాటా ఏసీ వాహనంలో వెళ్తుండగా.. కోదండపురం దగ్గర ప్రమాదానికి గురైంది. అదే రూట్లో గద్వాల జిల్లాకు వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గాయపడిన వారిని చూసి వెంటనే కారు ఆపారు. ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన స్వంత వాహనంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Next Story

