పచ్చబొట్టేయించుకుని అభిమానాన్ని చూపిస్తూ!!
అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపుతూ ఉంటారు.

అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపుతూ ఉంటారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రేగడి దోస్వాడ గ్రామానికి చెందిన అర్ధ మహేందర్‌రెడ్డి మాత్రం పచ్చబొట్టు వేయించుకుని చూపిస్తారు. ఆయన ఒంటిపై ప్రధాని మోదీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, నటులు చిరంజీవి, సోనూసూద్, దివంగత పునీత్ రాజ్‌కుమార్, ఐపీఎస్ అధికారులు ఉమేష్‌చంద్ర, సజ్జనార్ ఇలా మొత్తం 14 మంది ప్రముఖుల చిత్రాలను తన ఒంటిపై పచ్చబొట్లుగా వేయించుకున్నారు. అంతేకాదండోయ్ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పచ్చబొట్టు కూడా ఆయన ఒంటిపై ఉంది. 2007లో తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు రక్తదానం విలువ తెలుసుకున్న మహేందర్ ఇప్పటివరకూ 130 సార్లు రక్తదానం చేశారు. ఇక ఆయన తన కారుపై ఎన్నో సమాజహిత సందేశాలు, సూక్తులు రాయించారు. ఇద్దరు విద్యార్థినుల ఉన్నత చదువులకు చేయూత కూడా అందిస్తున్నారు.

