Sun Mar 15 2026 06:42:19 GMT+0530 (India Standard Time)
Breaking : షాద్ నగర్ లో భారీ పేలుడు... ఆరుగురి మృతి
షాద్ నగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు కార్మికులు మరణించారు

షాద్ నగర్ లో భారీ పేలుడు సంభవించింది. సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలోని గ్యాస్ ఫర్నేస్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు కార్మికులు మరణించారు. చాలా మందికి గాయాలపాలయ్యారు. అందుతునన సమాచారం మేరకు పదిహేను మందికి పైగానే తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతులు బీహార్, ఒడిశా, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో నూట యాభై మంది కార్మికులున్నారు.
మృతుల సంఖ్య...తి చందిన వారందరూ...
అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారని చెబుతున్నారు. గ్యాస్ ఫర్నేస్ లో పేలుడు సంభవించడంపై అధికారులు విచారణ ప్రారంభించారు. పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
Next Story

